Home సినిమా గాసిప్స్ ఓటీటీ వేదికకు మరో సినిమా : పాపం అనుష్క

ఓటీటీ వేదికకు మరో సినిమా : పాపం అనుష్క

thumb 1 2

లాక్ డౌన్ కారణంగా దేశంలోని థియేటర్లన్నీ మూతపడ్డాయి. మరల ఎప్పుడు తెరుచుకుంటాయోనని చెప్పడం దాదాపు అసాధ్యం. దీంతో దర్శక నిర్మాతలు సందిగ్ధ స్థితిలో కూరుకుపోయారు. చిన్న మధ్య తరహా సినిమాలు విడుదలకానున్న సందర్భంలో కేంద్రం లాక్ డౌన్ విధించడంతో ఈ సినిమాల విడుదలకు బ్రేక్ పడింది. ఇప్పటికే వేసవి సెలవులు ముగియడం దసరా నాటికి కూడా థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో అనేక సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ కు క్యూ కట్టాయి. ఇప్పటికే భారీ మల్టీస్టారర్ సినిమా అయినా “నాని వి” అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న విడుదల కానుండగా, అక్షయ్ కుమార్ లక్ష్మీబాంబ్ సెప్టెంబర్ 9న విడుదల కానుంది.   ఇప్పుడు ఈ దారిలో మరో సినిమా కూడా పైనిస్తున్నట్టు తెలుస్తోంది.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా కూడా ఓటీటీలో రానుందని తెలుస్తోంది. ఇప్పటికే కోనవెంకట్ అమెజాన్ ప్రైమ్ తో చర్చలు జరుపుతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. నిశ్శబ్దం సినిమా యొక్క  డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్‌కు సుమారు రూ .25 కోట్లకు దక్కించుకున్నట్లు పలు జాతీయ స్థాయి మీడియా సంస్థలు ప్రకటించాయి. థియేటర్ లో అందుబాటులో లేకపోవడంతో నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఓటీటీ ద్వారా విడుదల చేయాలనుకుంటున్నట్లు పలు కథనాలు వస్తున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ రెండో వారంలో అమెజాన్ లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది.

వాస్తవానికి ఈ సినిమాను ఏప్రిల్ 2 న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో తర్వాత సినిమాను వాయిదా వేశారు. ఈ సినిమా తెలుగు, ఇంగ్లీష్ తో పాటు అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అంజలి, సుబ్బరాజు, అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల సహాయక పాత్రల్లో నటించగా కోనవెంకట్ కధను అందించారు. ఓటీటీకి సంబంధించిన పూర్తి వివరాలను మరికొద్ది రోజుల్లో మూవీ టీం విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad