Home సినిమా టాలీవుడ్ న్యూస్ నిశ్శబ్ధం ఇంకా సాగుతూనే ఉందా..?

నిశ్శబ్ధం ఇంకా సాగుతూనే ఉందా..?

Nishabdam VFX Works Incomplete

టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా రిలీజ్‌ను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. కాగా ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో వేసవి కానుకగా రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చిన చిత్ర యూనిట్‌కు కరోనా రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడింది.

ఇక ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అనే సందేహం అందరిలోనూ నెలకొంది. థియేటర్లు తెరుచుకోవడం మరీ ఆలస్యం అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తాజాగా చిత్ర నిర్మాత కోన వెంకట్ ఓ పోల్ కూడా నిర్వహించాడు. ఇందులో ఎక్కువ శాతం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల్సిందిగా కోరారు. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నది, లేనిది అనే అంశంపై చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

కాగా దీని వెనకాల ఓ బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా కొనసాగుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో ఓ కంపెనీ చేసిన వీఎఫ్ఎక్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో, ఇప్పుడు ఆ పనులను మరో కంపెనీకి ఇచ్చారట చిత్ర యూనిట్. ఈ లెక్కన నిశ్శబ్ధం చిత్రం రిలీజ్ ఈయేడు అవుతుందో లేదో అనే సందేహం అందరిలో నెలకొంది. అనుష్క మెయిల్ లీడ్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad