
బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినా పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. అయితే గతేడాది రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అమ్మడికి అదిరిపోయే క్రేజ్ వచ్చిపడింది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అమ్మడి అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయిన నిధి, వరుసగా ఆఫర్లు వచ్చి పడతాయని అనుకుంది.
కానీ సీన్ రివర్స్ అయ్యి ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్లు కూడా ఏమీ రాలేదు. దీంతో మళ్లీ ఈ బ్యూటీ బాలీవుడ్‌వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన్ను తొలిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయానంటోంది ఈ బ్యూటీ. ఇక జీవితంలో ఒక్కసారైనా ఆయనతో సినిమా చేయాలనేది తన కోరిక అని నిధి చెబుతోంది. రణ్‌బీర్ కపూర్ నటించే ప్రతి సినిమాను తాను తప్పక చూస్తానంటూ చెప్పుకొచ్చింది ఈ అందాల భామ.
ఇక టాలీవుడ్లో ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. తమిళంలోనూ ఓ సినిమాను ఓకే చేసింది ఈ ఇస్మార్ట్ పోరి. కాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫోటోషూట్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరి ఈ బ్యూటీ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి అంటున్నారు ఆమె అభిమానులు.