Home సినిమా నీలి నీలి ఆకాశానికి 16 కోట్ల మంది ఫిదా!

నీలి నీలి ఆకాశానికి 16 కోట్ల మంది ఫిదా!

neeli neeli akasam song

టాలీవుడ్‌లో బుల్లితెర యాంకర్ నుండి వెండితెరపై నటులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వారి సంఖ్య చాలా పెద్దగా ఉంది. ఈ జాబితాలో తాజాగా యాంకర్ ప్రదీప్ కూడా చేరాడు. అయితే ప్రదీప్ ఏదో క్యారెక్టర్ పాత్రలో నటించడం లేదు. ఏకంగా హీరో పాత్రలో యాంకర్ ప్రదీప్ నటిస్తుండటంతో ఈ సినిమా గురింటి తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం..’ అనే పాట తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

ఈ పాట లిరిక్స్ పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ పాటను పదేపదే వింటున్నారు. ఇక ఈ పాట యూట్యూబ్‌లో సరికొత్త సంచలనాన్ని సృష్టించింది. ఈ పాటకు ఏకంగా 160 మిలియన్ వ్యూస్ రావడంతో ఈ పాటను ఏకంగా 16 కోట్ల మంది వీక్షించారంటూ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. యాంకర్ నుండి హీరోగా మారిన ప్రదీప్ నటిస్తున్న ఈ సినిమాలోని పాటకు ఇంతమేర రెస్పాన్స్ రావడం నిజంగా విశేషం అని అంటున్నారు సినీ జనం. ఇక ప్రదీప్ సరసన ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ప్రాణంగా నిలిచిందని చెప్పాలి. మరి ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఇన్ని అద్భుతాలు చేస్తే, రిలీజ్ తరువాత ఎలాంటి అద్భుతాలను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad