Home సినిమా నితిన్‌ను భారీగా డిమాండ్ చేస్తున్న తమిళ బ్యూటీ.. ఎవరో తెలుసా?

నితిన్‌ను భారీగా డిమాండ్ చేస్తున్న తమిళ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Heroine-Nayanatara

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’ అనే యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు ఈ యంగ్ హీరో రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సక్సె్స్‌ను అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమా తరువాత నితిన్ ఓ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీని రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్‌లో సూపర్ సక్సె్స్ అయిన ‘అంధాధున్’ చిత్రాన్ని తెలుగులో దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో టబు పోషించిన పాత్రలో తమిళ బ్యూటీ నయనతారను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు నయనతార కళ్లు చెదిరే రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

సాధారణ హీరోయిన్‌గా నటించేందుకు నయనతార రూ.2 కోట్ల మేర డిమాండ్ చేస్తుందని, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు అమ్మడు ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కాగా నితిన్ అంధాధున్ రీమేక్ చిత్రంలో కీలక పాత్రలో నటించేందుకు నయన్ ఇంత భారీ మొత్తం డిమాండ్ చేయడంతో ఆ చిత్ర నిర్మాతలు అవాక్కయ్యారు. తొలుత ఈ సినిమాలో నటించేందుకు టబును సంప్రదించగా, ఆమె భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఆ తరువాత గోవా బ్యూటీ ఇలియానాను కూడా సంప్రదించగా, ఆమె ఈ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందట. మరి నయన్ డిమాండ్‌కు చిత్ర నిర్మాతలు ఎలా రెస్పాండ్ అవుతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad