Home సినిమా గాసిప్స్ ఓటీటీలోనే నాని “వి” : భలే మోసం చేశారు!

ఓటీటీలోనే నాని “వి” : భలే మోసం చేశారు!

Nani V movie

కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించిన అప్పటినుండి సినిమా థియేటర్లు మూతపడ్డాయి . ఎప్పుడు తెరుచుకుంటాయో ? సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. మరో వైపు ప్రొడ్యూసర్లు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. సినిమాలకు తీసుకున్న వడ్డీలను కట్టలేక కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ఓటిటి ప్లాట్ ఫామ్ చిన్న సినిమాలకు మంచి వేదికగా తయారైంది. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన “వి” చిత్రం ఓటిటి విడుదల కానుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సినిమాను 35 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కొన్నదని సెప్టెంబర్ 5న విడుదల కానుందని ఒక వార్త సోషల్ మీడియాలోనూ ఇటు వార్తాపత్రికలలోను సంచలనంగా మారింది.

మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం తారాగణం నాని, నివేద థామస్, సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి వంటి స్టార్స్ ఉండటం సినిమాను మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి . దిల్ రాజు మొదట ఈ సినిమాను మే నాడు విడుదల చేద్దాం విడుదల చేద్దాం అప్పటికీ లాక్ డౌన్ కారణంగా సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు ఓటిటిలో విడుదలని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం కొన్ని మీడియా సంస్థలు శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్ ను సంప్రదించగా సినిమాను డైరెక్ట్ గా థియేటర్ లోనే విడుదల చేయనున్నట్లు చెప్పారు. అంటే సోషల్ మీడియాలో ఇటు వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవం. నాని “వి” డైరెక్ట్ గా థియేటర్ లోనే దర్శనమివ్వనుంది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ లు నమ్మవద్దని ఈ సందర్భంలో నాని గుర్తు చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad