Home సినిమా టాలీవుడ్ న్యూస్ క్రిస్మస్ కానుకగా నాని సినిమా..?

క్రిస్మస్ కానుకగా నాని సినిమా..?

nani thumb

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో మరో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అటు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకొని టీజర్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాయి.

అయితే ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. తొలుత వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించక పోవడంతో ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాను దసరాకు కూడా రిలీజ్ చేయలేకపోతున్నారు. దీంతో ఈ సినిమాను ఏకంగా క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అప్పటి వరకు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని వారు ఆశిస్తున్నారు. ఇక సుధీర్ బాబు పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, అదితి రావు హైదరీలు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad