Home సినిమా గాసిప్స్ నాని ‘వి’ స్టోరీ లీక్.. ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

నాని ‘వి’ స్టోరీ లీక్.. ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

Nani V Movie Story Leaked

యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు నాని రెడీ అవుతున్నాడు. సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా ఈ సినిమాను పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కించినట్లు చిత్ర పోస్టర్, టీజర్లు చూస్తే అర్థమవుతోంది.

అయితే ఈ సినిమాను తొలుత థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదిరేలా లేకపోవడంతో, ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ క్రమంలోనే ‘వి’ చిత్ర కథ సోషల్ మీడియాలో లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నాని భార్య అదితిరావు హైదరీని అతి కిరాతకంగా చంపేస్తారు. దీంతో తన భార్యను చంపినవారిని అంతమొందించేందుకు నాని వేట మొదులపెడతాడు. కాగా నాని చేస్తున్న మర్డర్‌లను పోలీస్ అయిన సుధీర్ బాబు ఎలా చేధిస్తాడు అనేది సినిమా కథ.

‘వి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టి ఓ సరికొత్త రివెంజ్ డ్రామాను మనముందుకు తీసుకొస్తున్నారు నాని అండ్ టీమ్. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వి చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 5 వరకు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad