
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంటాడని అందరూ భావించాడు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. సెప్టెంబర్ 5న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేందుక చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
అయితే ఈ సినిమా కథ విషయంలో ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమా కథ యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అదితి రావు హైదరీ హత్యకు గురవుతుంది. ఆమెను హత్య చేసిన వారిని వెంటాడి చంపుతుంటాడు. ఈ క్రమంలో సుధీర్ బాబు నానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ కథను తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిన అయేషా మీరా కేసు ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో, అందులోని కొన్ని ఘటనలను తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొత్తానికి దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తీసుకున్న సబ్జెక్ట్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో బ్యూటీ నివేధా థామస్ కూడా నటిస్తుండగా, దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.