Home సినిమా టాలీవుడ్ న్యూస్ వింత వ్యాధితో బాధపడుతున్న నాని.. కరోనా కాదండోయ్!

వింత వ్యాధితో బాధపడుతున్న నాని.. కరోనా కాదండోయ్!

Nani To Suffer Bipolar Disorder In Tuck Jagadeesh copy

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో నాని మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో నానితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తరువాత నాని తన నెక్ట్స్ మూవీని కూడా రెడీ చేసే పనిలో పడ్డాడు.

దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో టక్ జగదీష్ అనే సినిమాను నాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతూ కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో నాని బైపోలార్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడతాడని, ఈ వ్యాధి కారణంగా బాగా ఎమోషనల్ అయినప్పుడు తాను ఏం చేస్తాడో తనకు తెలియదు అని చిత్ర యూనిట్ తెలిపింది. భాగోద్వేగం ఎక్కువైనప్పుడు ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారో చెప్పడం అసంభవం అని, అలాంటి పాత్రలో నాని యాక్టింగ్ పీక్స్‌లో ఉంటుందని తెలుస్తోంది.

మొత్తానికి నానిలోని నటుడిని పూర్తిగా వాడేందుకు దర్శకుడు శివ నిర్వాణ మరోసారి రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో నాని సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని, నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. గతంలో నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన నిన్ను కోరి సినిమా తరహాలో ఈ సినిమా కూడా సక్సెస్ కొడుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad