Home సినిమా గాసిప్స్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు : నాని మాస్టర్ ప్లాన్

ఒకే దెబ్బకు రెండు పిట్టలు : నాని మాస్టర్ ప్లాన్

nai 2

కొంత మంది టాలీవుడ్ హీరోలు సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు చేయడానికి కష్టపడుతున్న సందర్భంలో నాని ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్పీడ్ ఏ నానిని సేఫ్ జోన్ లో ఉంచినట్టు తెలుస్తుంది. నేచురల్ స్టార్ ఇప్పటికే వి అనే యాక్షన్  థ్రిల్లర్ సినిమా చేశాడు. ఇది విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే శ్యామ్ సింగ రాయ్ అనే  వైవిధ్యమైన సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలకూ మొదట్లోనే పారితోషకం తీసుకోవడంతో రెమ్యూనరేషన్ లో కట్ ఉండదు. ఈ చిత్రాలు కొనసాగుతుండగానే నాని శివనిర్వాణ, వివేక్ ఆత్రేయ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటికి కూడా ముందే రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీలో అనేక మంది చర్చించుకుంటున్నారు. అంటే ఇందులో కూడా కరోనా రెమ్యూనరేషన్ లో కట్ ఉండదు.

ఈ మొత్తం సినిమాలు తెరకెక్కడానికి దాదాపు సంవత్సరం పూర్తవుతుంది. ఇంతలో కరోనా ఉధృతి కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే రెమ్యూనరేషన్ విషయంలో నాని సేఫ్.  శివనిర్వాణ, వివేక్ ఆత్రేయ సినిమాలు పూర్తిగా కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలు. ముఖ్యంగా టక్ జగదీష్ పక్కా కుటుంబ కధ చిత్రం. తన గత చిత్రాల మాదిరి శివనిర్వాణ ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కుటుంబ రాజకీయాల ఈ నేపథ్యంలో తెరకెక్కనుందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

ఒకప్పటి మణిరత్నం ఘర్షణ, నవాబ్ సినిమాల మాదిరిగా వుంటుందట. అన్నదమ్ములు ఆధిపత్యం, రాజకీయాలూ.. ఎత్తులకు పై ఎత్తులు అంతర్గత కుమ్ములాటలు టక్ జగదీష్ ఉండనున్నాయని ని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ సినిమా ఇప్పటికి 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. వన్స్ లాక్ డౌన్ ఎత్తివేయాగానే సినిమాను పూర్తిచేసి విడుదల చేయాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారు. నాని చేస్తున్న ఈ సినిమాలన్నీ కుటుంబ కథా నేపథ్యంలో రావడం, తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ అధికంగా ఉండడం ఈ కారణంగా ఈ సినిమాల పై కరోనా ప్రభావం పడే అవకాశం చాలా తక్కువ.  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad