
యంగ్ హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యాంతం సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగింది. ఈ సినిమాలో నాని ఓ సీరియల్ మర్డరర్‌గా మనకు కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడిని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్‌గా సుధీర్ బాబు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో వారిద్ది మధ్య నడిచే టామ్ అండ్ జెర్రీ తరహా ట్రాక్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేయనున్నాయి. ఇక ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయేలా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, అదితి రావు హైదరీలు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని చిత్ర వర్గాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయి. అటు ఈ సినిమాను సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ‘వి’ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.