Home సినిమా గాసిప్స్ నాని ‘వి’ ఎక్స్‌క్లూజివ్ ప్రీ-రివ్యూ.. లడ్డు కావాలా నాయనా?

నాని ‘వి’ ఎక్స్‌క్లూజివ్ ప్రీ-రివ్యూ.. లడ్డు కావాలా నాయనా?

Nani V Movie Pre Review

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మార్చిలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించగా, లాక్‌డౌన్ వారి ఆశలపై నీళ్లు జల్లింది. ఈ సినిమాలో నాని విలన్‌గా, సుధీర్ బాబు హీరో పాత్రలో నటిస్తున్నాడనే వార్త రావడంతోనే ఈ సినిమాపై అంచానలు అమాంతం పెరిగిపోయాయి.

కాగా ఇప్పుడు అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను ఇప్పటికే తిలకించిన చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రివ్యూ కూడా వచ్చేసింది. ఈ సినిమాపై నాని అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందట. అయితే ఈ సినిమాలో నాని(విక్రమాదిత్య) నెగెటివ్ పాత్రలో నటిస్తున్నా ఆయన్ను హీరోలా ఎలివేట్ చేసే సీన్స్ మరీ ఎక్కువగా ఉండటమే ఈ సినిమాకు మైనస్ కానుందట. అటు మరో హీరో సుధీర్ బాబు(వివేక్ కృష్ణ)ను హీరోగా చూపించే సీన్స్ చాలా తక్కువగా ఉండటంతో, ఆయన ఓ క్యారెక్టర్ పాత్రకు మాత్రమే పరిమితం అయ్యాడని తెలుస్తోంది.

వరుస మర్డర్లు చేస్తున్న విక్రమాదిత్యను పట్టుకునేందుకు వివేక్ కృష్ణ వేసే ఎత్తులు, వాటిని విక్రమాదిత్య ఎలా చిత్తు చేస్తూ ముందుకు వెళ్లాడు అనే ట్రాక్‌ను డైరెక్టర్ బాగా చూపించాడట. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో వారిద్దరి మధ్య నడిచే సీన్స్, ట్విస్టులు రివీల్ అయ్యే విధానం సినిమాకు బాగా తోడవుతాయని అందరూ అనుకుంటుండగా, సినిమాలో అలాంటి పెద్ద మ్యాటర్ ఏమీ లేదని తెలుస్తోంది. క్లైమాక్స్ ఎపిసోడ్‌ను చాలా నార్మల్‌గా ముగించేశారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్లతో పెద్దగా పనే ఉండదని, వారి కారణంగా సినిమా చాలా ల్యాగ్‌లా అనిపిస్తుందని తెలుస్తోంది. మొత్తానికి నాని ‘వి’ చిత్రం భారీ అంచనాలు పెట్టుకున్న వారికి లడ్డూ కావాలా నాయనా అనే రేంజ్‌లో ట్విస్ట్ ఇవ్వనుందట. అందుకే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad