
నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో నాగ శౌర్యల మధ్య గతకొంత కాలంగా మాటలు లేవని ఇండస్ట్రీ వర్గాల టాక్. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రం సమయంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి, వారు ఎడమొహం పెడమొహంలా ఉంటూ వస్తున్నారు. ఎక్కడా కూడా ఒకరి చిత్రాలను మరొకరు ప్రస్తావించలేదు. దీంతో వారిద్దరి మధ్య ఎప్పటికీ స్నేహం ఏర్పడదా అని అందరూ అనుకున్నారు.
కాగా నాని నటిస్తున్న తాజా చిత్రం ‘వి’ ఓటీటీలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సనిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందడటంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో నాని మంచి నిర్ణయం తీసుకున్నాడని నాగశౌర్య ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తాడు. కరోనా లాంటి విపత్కర సమయంలో నాని తీసుకున్న నిర్ణయంతో ఇంకా మున్ముందు చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతాయని, ఇలాగైనా నిర్మాతల కష్టాలు కొంతమేర తీరుతాయని నాగశౌర్య అన్నాడు.

నాగశౌర్య తన సినిమా రిలీజ్పై ట్వీట్ చేయడంతో నాని స్వయంగా అతడికి కాల్ చేసి మాట్లాడినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా కొంతకాలంగా మాటలే లేని వీరిద్దరు ఇలా మాట్లాడుకోవడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పిణామాలు ఇండస్ట్రీలో మంచివని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక నాని ‘వి’ చిత్రం సక్సెస్ కావాలని నాగశౌర్య కోరుకున్నాడు.