Home సినిమా నంద‌మూరి, మెగా హీరోల‌కు తేడా అదే..!

నంద‌మూరి, మెగా హీరోల‌కు తేడా అదే..!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌నుకు మెగా హీరోలు, నంద‌మూరి హీరోల‌పై ఒక క్లారిటీ ఉంది. మెగా హీరోల‌తో సినిమా తీసేట‌ప్పుడు గెట‌ప్ గురించి పెద్ద‌గా ఆలోచించ‌డు. అదే నంద‌మూరి హీరోల‌ను డైరెక్ట్ చేయాలంటే గెటప్స్‌పై ఫోక‌స్ పెడ‌తాడు. బోయ‌పాటి ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు మెగా హీరోల‌ను డైరెక్ట్ చేశాడు. బ‌న్నీతో తీసిన స‌రైనోడు స్టైలిష్ స్టార్ కెరీర్‌లో టాప్‌గా నిలిచింది. ఇందులో బ‌న్నీ నార్మ‌ల్‌గానే క‌నిపించినా హీరోతో భారీగా కండ‌ల‌ను పెంచించాడు బోయ‌పాటి

మెగా కాంపౌండ్‌లో బోయ‌పాటి అడుగుపెడితే హీరోలు కండ‌లు పెంచాల్సిందే. రామ్‌చ‌ర‌ణ్‌తో తీసిన విన‌య విధేయ రామ సంక్రాంతికి వ‌స్తోంది. దీనికోసం రామ్‌చ‌ర‌ణ్ వ‌ర్క‌వుట్స్ చేసి మ‌రీ సిక్స్‌ప్యాక్ తీసుకొచ్చాడు.

ఇక నంద‌మూరి హీరోల‌ను డైరెక్ట్ చేయాల్సి వ‌స్తే కండ‌ల జోలికి పోకుండా గెట‌ప్స్‌పై దృష్టిపెడ‌తాడు బోయ‌పాటి. బాలయ్య‌ను సింహా, లెజెండ్ చిత్రాల్లో డిఫ‌రెంట్‌గా చూపించి స‌క్సెస్ అయ్యాడు. అలాగే, ద‌మ్ములో ఎన్టీఆర్ మీస‌క‌ట్టును మార్చి కొత్త లుక్‌ను తీసుకొచ్చాడు. విన‌య విధేయ రామ త‌రువాత బాల‌య్య‌తో తీయ‌బోయే సినిమాలో సింహా, లెజెండ్ కు మించి ఎలాంటి గెట‌ప్‌తో చూపిస్తాడో చూడాలి మ‌రి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad