Home Latest News న్యూసెన్స్ కేసులో చిక్కిన 'నందమూరి' వారసుడు

న్యూసెన్స్ కేసులో చిక్కిన ‘నందమూరి’ వారసుడు

సీనియర్ నటుడు దివంగత నందమూరి తారకరామారావు కుటుంబంలోని వారసులంతా కూడా సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. మరి కొందరికి అవకాశాలు లేక సొంతగా వ్యాపారము చేసుకుంటున్నారు. అందులో ఒకరు నందమూరి తారకరత్న తాను ఎన్ని సినిమాలు చేసిన అంతగా సక్సెస్ ని చేజిక్కుంచుకోలేకపోయాడు. దీంతో తాను హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లో ‘కబరా డ్రైవ్ ఇన్’ పేరుతో ఒక రెస్టారెంట్ పెట్టుకున్నాడు. అయితే తాను చేసే బిసినెస్ అక్రమంగా జరుగుతుందని జిహెచ్ఎంసి అధికారులు తారకరత్నకు షాక్ ఇచ్చారు. అధికారులు రెస్టారెంట్ ను కూల్చివేయడానికి ప్రయత్నించారు. ఇక ఈ సంఘటనలో రెస్టారెంట్ వారికీ అధికారులకు తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

తారకరత్న సమాచారాము అందుకుని హుటాహుటిగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులతో తారకరత్న వాదనకు దిగారు. అయితే ఈ రెస్టారెంట్ నియమనిబంధనలు ఉల్లంగిస్తున్నట్లు అధికారులు కూడా వాదించారు. పగలు రాత్రి అనే సమయం తేడా లేకుండా మద్యం అమ్మకాలు చేస్తూ, భారీ శబ్దాలతో డీజేలు పెడుతూ అల్లరులు చేస్తున్నారని కంప్లైంట్ వచ్చిందని చెప్పారు. న్యూసెన్స్ కలిగిస్తున్న రెస్టారెంట్ పై ఎంఎల్ఏ కాలనీ వాసులు జి.హెచ్.ఎం.సి అధికారులకు ఫిర్యాదు ఇవ్వడంతో అధికారులు అక్కడికి చేరుకుని, రెస్టారెంటుకి సరైన అనుమతులు లేకుండానే నడుపుతున్నారని అందువల్లే కూల్చేందుకు ప్రయత్నించామని అధికారులు తెలిపారు. దీంతో తారకరత్న కొంత గడువు కావాలని అడగగా అధికారులు మూడు గంటల సమయం ఇవ్వడంతో తారక్ అక్కడి నుండి సామాన్లు భద్రంగా తరలించుకున్నాడు.

ఇక అసలు విషయానికొస్తే ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే, తారకరత్న రెస్టారెంట్ కూల్చి వేయడమేంటని కొందరి వాదన. ప్రముఖ కుటుంబానికి చెందిన తారక్ కే ఇలా జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటాని అంటున్నారు. తారక్ కి కేవలం మూడు గంట వ్యవధి ఇవ్వడమేంటి? ఇంత త్వరగా రెస్టారెంట్ కూల్చి వేయడం వెనుక ఎవరి హస్తముందో అని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad