Home సినిమా టాలీవుడ్ న్యూస్ నిర్మాతలకు క్లాస్ పీకిన నాగ్.. ఎందుకో తెలుసా?

నిర్మాతలకు క్లాస్ పీకిన నాగ్.. ఎందుకో తెలుసా?

Nagarjuna Warns Chay Akhil Producers

అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా ప్రభావంతో వాయిదా పడింది. కాగా తన కొడుకులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్‌లకు సంబంధించిన కెరీర్ ప్లాన్‌ను కూడా నాగ్ చూసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో నాగ చైతన్య ఇప్పుడిప్పుడే ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అఖిల్ మాత్రం ఇంకా సక్సె్స్‌ఫుల్ హిట్ అందుకోలేకపోయాడు.

అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా తన కొడుకలు నటిస్తున్న చిత్రాలు ఎటు వెళ్తాయా అనే ఆందోళనలో నాగ్ ఆయా చిత్ర దర్శకనిర్మాతలో చర్చలు జరిపాడట. నాగచైతన్య నటిస్తున్న ‘లవ్‌స్టోరి’ చిత్రానికి సంబంధించి దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు, అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్ర నిర్మాత అల్లు అరవింద్‌లతో నాగ్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా థియేటర్లు మూతపడ్డాయన, అలా అని వారి సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయకుండా చూడాని ఆయన ఈ సంద్భంగా వారికి చెప్పాడట.

ఏది ఏమైనా తన కొడుకులు నటిస్తున్న చిత్రాలను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని, అది ఎంత ఆలస్యమైనా పర్వాలేదని ఆయన వారికి సూచించాడట. దీంతో ఆయా చిత్ర దర్శకనిర్మాతలు కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మిగతా వారిలా సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయకుండా తన కొడుకుల చిత్రాలను ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేశాడు నాగ్. మరి ఈ విషయంలో నాగ్ నిర్ణయం ఎంతమేర కరెక్ట్ అని తేలుతుందో తెలియాలంటే ఆ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad