
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గతకొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు. ఆయన హీరోగా నటించిన లాస్ట్ మూవీ మన్మధుడు-2 బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలిసిందే. ఆ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న నాగ్, అది డిజాస్టర్ కావడంతో తన నెక్ట్స్ చిత్రాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాలో నటిస్తున్న నాగ్, తన నెక్ట్స్ ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.
ఇటీవల యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు నాగ్‌కు ఓ మంచి కథను వినిపించగా, ఆ కథ ఆయనకు బాగా నచ్చిందని.. వెంటనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ప్రవీణ్ సత్తారుతో సినిమా కంటే ముందే మరో క్రేజీ డైరెక్టర్‌తో సినిమా చేసి అదిరిపోయే హిట్ అందుకోవాలని నాగ్ చూస్తున్నాడట. ఈ క్రమంలోనే దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మరోసారి సినిమా చేసేందుకు నాగ్ రెడీ అవుతున్నాడట. గతంలో సూపర్, శివమణి వంటి చిత్రాలతో సక్సెస్ఫుల్ కాంబోగా పేరుతెచ్చుకోగా, ఇప్పుడు మరోసారి వీరిద్దరు చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అదిరిపోయే ఫాంలోకి వచ్చిన పూరీ జగన్నాథ్, ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పూరీతో సినిమా చేస్తే, ఆ సినిమాకు మంచి క్రేజ్ దక్కుతుందని నాగ్ భావిస్తున్నాడట. మరి నాగ్ కోసం పూరీ ఎలాంటి కథను రెడీ చేస్తాడో తెలియాలంటే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసేవరకు ఆగాల్సిందే. ఏదేమైనా ఈ కాంబోలో రాబోయే సినిమా హ్యాట్రిక్ విజయం అందుకుంటుందని నాగ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.