Home సినిమా టాలీవుడ్ న్యూస్ సూసైడ్ చేసుకోవాలనుకున్న నాగబాబు.. ఆపింది ఎవరో తెలుసా?

సూసైడ్ చేసుకోవాలనుకున్న నాగబాబు.. ఆపింది ఎవరో తెలుసా?

Nagababu Wanted To Commit Suicide

మెగాస్టార్ సోదరుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగబాబు, హీరోగా మార్క్ వేసుకోలేకపోయినా మంచి నటుడిగా మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. చిరు సహకారంతో పలు సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లో నటించిన నాగబాబు, ఆ తరువాత నిర్మాతగా మారి తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే నిర్మాతగా అనుకున్న స్థాయిలో ఆయన సక్సెస్ కాలేదు. ఒకానొక సమయంలో నిర్మాతగా మారినందుకు నాగబాబు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఇటీవల ఓ కార్యక్రమంలో నాగబాబు స్వయంగా వెల్లడించాడు.

నాగబాబు తన జీవితంలో రెండు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించాడు. తన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తన ఫ్యామిలీతో కలిసి న్యూజీలాండ్‌కు హాలీడే ట్రిప్‌కు నాగబాబు వెళ్లాడు. అయితే ఆ సమయంలో తనలాగే ఓ వ్యక్తి డ్రెస్ వెసుకోవడంతో, నిహారికా అతడితో వెళ్లిపోయింది. ఈ క్రమంలో నిహారికా కోసం నాగబాబుతో కలిసి కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారు. కానీ 20 నిమిషాలు దాటినా ఆమె జాడ కనిపించలేదు. దీంతో తన వల్లే నిహారికా తప్పిపోయిందంటూ, ఆయన ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. నిహారికా అంటే తనకు ఎంతో ప్రేమో ఈ సందర్భంగా నాగబాబు చెప్పుకొచ్చాడు.

ఇక మరో సందర్భంలో ‘ఆరెంజ్’ చిత్రానికి నిర్మాతగా భారీ నష్టాన్ని ఎదుర్కొన్న నాగబాబు, ఆ సమయంలో అప్పులపాలయ్యాడట. దీంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని భావించాడట. అయితే తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల సాయంతో ఆయన అప్పుల ఊబి నుండి బయటపడినట్లు తెలిపాడు. ఇలా ఈ రెండు ఘటనల కారణంగా నాగబాబు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఆయన తెలపడంతో మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ప్రస్తుతం తన కూతురు నిహారికా పెళ్లి పనుల్లో నాగబాబు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad