Home టాప్ స్టోరీస్ చిరంజీవిని ఘోరంగా అవమానించారు...నాగబాబు

చిరంజీవిని ఘోరంగా అవమానించారు…నాగబాబు

jpg 10

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే. క్రింది స్థాయి నుండి స్వశక్తితో ఉన్నత శిఖరాలకు అధిరోహించిన ఆయన మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. తాజాగా చిరంజీవికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబు తన అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గురించి ఎవరికీ తెలియని విషయాన్ని ‘మన ఛానల్ మన ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘మెగాస్టార్ సక్సెస్ సీక్రెట్స్’ అంటూ మూడు ఎపిసోడ్ లను విడుదల చేశారు.

ఈ వీడియోలో నాగబాబు చిరంజీవి జీవితంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను వివరించాడు. మెగాస్టార్ ఇండస్ట్రీకి రావడానికి ముందు నుండే కాలేజీలో అమ్మాయిల ఫాలోయింగ్ బాగా ఉండటంతో పాటు అద్భుతమైన నటన కౌశల్యాన్ని ప్రదర్శించే నాగబాబు తెలిపారు. చిరు పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత నటన కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ ది మొదటి బ్యాచ్ కాగా, చివరి బ్యాచ్ లో చిరంజీవి ఉండేవారు. చిరుకి ఇన్స్టిట్యూట్లో సుధాకర్ హరి ప్రసాద్ అని స్నేహితుడు ఉండేవాడు. వీరితోపాటు చిరుకి సూరి అనే మరో స్నేహితుడు కూడా ఉండేవాడు.

సూరి అప్పటికే డైరెక్టర్ కమ్ యాక్టర్. ఒకరోజు ఓ బడ హీరో సినిమా విడుదలైంది. ఆ సినిమా ప్రివ్యూ చూడడానికి స్నేహితుడు సూరి కుటుంబంతో పాటు చిరంజీవి కూడా వెళ్లారు. సినిమా చూడడానికి  థియేటర్ ముందు సీట్లో కూర్చున్నారు. ఇంతలో హీరోకి తెలిసిన వాళ్ళు అక్కడకు వచ్చి చిరు అక్కడి నుండి లేచి వెళ్ళమని అన్నారట. అందరూ చూస్తుండగానే వాళ్ళు ఇలా అనడంతో ఇలా అనడంతో చిరు సిగ్గుతో లేచి వెనుక కుర్చీలో కూర్చున్నారు. ఆ తర్వాత సినిమా టాక్ తెలుసుకోవడానికి సూరి ఫ్యామిలీ చిరుని ఇంటికి రమ్మన్నార౦ట. అయితే చిరు మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు.

దీనికి గల కారణాన్ని తెలుసుకున్న సూరి కుటుంబం చిరంజీవికి ఓదార్పు మాటలు చెబుతూ ..”వాళ్ళు అంతే వదిలేయ్ చిరంజీవి.. నువ్వు మంచి  ఓ మంచి యాక్టర్  అవుతావు అన్నారు. దీనికి చిరు సమాధానంగా నేను ఇండస్ట్రీకి హీరో అవుదామని వచ్చాను… ఇక నుండి నేను నెంబర్ వన్ హీరో… అవ్వడమే మే నా టార్గెట్. ఎవరైతే నా ముందు ఫోజు కొట్టారు.. వాళ్ళ ముందే దర్జాగా కూర్చుంటాను. దీనిని ఎలా సాధించాలో దాని కోసం ఎంత కష్టపడ్డాలో  నాకు తెలుసు అని చెప్పి వెళ్లిపోయారు. చిరంజీవి స్వశక్తితో కింద నుంచి పైకి వచ్చారని నాగబాబు తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad