Home సినిమా గాసిప్స్ బాలీవుడ్ డైరెక్టర్ దెబ్బకు వణికిపోతున్న తెలుగు డైరెక్టర్..

బాలీవుడ్ డైరెక్టర్ దెబ్బకు వణికిపోతున్న తెలుగు డైరెక్టర్..

Nag Ashwin Worried With Om Rau

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి తన నెక్ట్స్ చిత్రాలను పట్టాలెక్కించేందుకు డార్లింగ్ తెగ ఆరాటపడుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ తన నెక్ట్స్ రెండు చిత్రాలను ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘మహానటి’ వంటి చిత్రంతో జాతీయ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రభాస్ ఇప్పటికే పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే తన నెక్ట్స్ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ అనే సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు. కాగా రాధేశ్యామ్ చిత్రం తరువాత నాగ్ అశ్విన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రభాస్ ఆయనకు మాటిచ్చాడట. కానీ తాజాగా ఓ రావుత్ ఆదిపురుష్ చిత్రాన్ని 2021 జనవరిలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రకటించాడు. అటు ప్రభాస్ కూడా ఆదిపురుష్ సినిమా కోసం ట్రెయినింగ్ ప్రారంభించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఈ వార్తలతో నాగ్ అశ్విన్ వణికిపోతున్నాడట. అసలే భారీ బడ్జెట్ చిత్రం కావడంతో తొలుత తన చిత్రాన్నే చేస్తానన్న ప్రభాస్ ఇప్పుడు వేరే సినిమాను ప్రారంభించడం ఏమిటని ఆయన ఫీల్ అవుతున్నాడట. ఏదమైనా ప్రభాస్ ఇంకా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేస్తున్నాయి. ఇక రాధేశ్యామ్ చిత్రాన్ని రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad