Home సినిమా గాసిప్స్ ‘ఆదిపురుష్’లో ప్రభాస్ చేసే పాత్ర ఏమిటో చెప్పేసిన నాగ్ అశ్విన్

‘ఆదిపురుష్’లో ప్రభాస్ చేసే పాత్ర ఏమిటో చెప్పేసిన నాగ్ అశ్విన్

Nag Ashwin Reveals Role Of Prabhas In Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయడనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కిస్తూ సినీ ఇండస్ట్రీలో సునామీ క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాడు డార్లింగ్. ఇప్పటికే బాహుబలి, సాహో వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, తాజాగా రాధేశ్యామ్ చిత్రంతో మరోసారి అదిరిపోయే సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను కూడా క్యూలో పెడుతున్నాడు ఈ హీరో.

ఇందులో భాగంగా మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీలో నటించేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు. పూర్తి సైన్స్ ఫిక్షన్ సినిమాగా రానున్న ఈ సినిమాలో ప్రభాస్ ఓ సూపర్ హీరోగా కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ప్రభాస్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పి తాజాగా ఆ సినిమాను అనౌన్స్ కూడా చేశాడు. ‘ఆదిపురుష్’ అనే టైటిల్‌తో రానున్న ఈ మైథలాజికల్ మూవీ రామాయణం ఆధారంగా రానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏమిటనేది మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు.

కాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్‌ను రాముడి అవతారంలో వీలైనంత త్వరగా చూడాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. దీంతో ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడనే విషయం బట్టబయలైంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం అప్పుడే ఎదురుచూస్తున్నారు. కాగా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ‘ఆదిపురుష్’ను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad