Home రాజకీయాలు ఏపి వార్తలు చంద్రబాబు వైఎస్ఆర్ స్నేహం.. అదిరిపోతుందట చిత్రం!

చంద్రబాబు వైఎస్ఆర్ స్నేహం.. అదిరిపోతుందట చిత్రం!

Movie On Chandrababu Naidu YSR Friendship On Cards

టాలీవుడ్‌లో ఇటీవల బయోపిక్ చిత్రాల హవా జోరుగా నడుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్ఆర్, సావిత్రి వంటి లెజెండరీ వ్యక్తుల బయోపిక్ చిత్రాలను పలువురు దర్శకనిర్మాతలు తెరకెక్కించగా, ప్రేక్షకులు వాటికి మంచి ఆదరణను అందించారు. కాగా ఇప్పుడు ఇద్దరు రాజకీయ నేతలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తులుగా నారా చంద్రబాబు నాయుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిలు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

కాగా రాజకీయ పరంగా ఎప్పుడూ ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతూ కనిపించిన వీరిద్దరి మధ్య వ్యక్తిగతంగా మంచి స్నేహం ఉండేది. ఇప్పుడు ఇదే విషయాన్ని సినిమా రూపంలో చూపించేందుకు రాజ్ అనే కొత్త దర్శకుడు ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపు మూడు దశాబ్దాలు చంద్రబాబు, వైయస్ఆర్ రాజకీయ శత్రువులుగా కొనసాగారు. అయితే వారి మధ్య ఉన్న స్నేహాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని సదరు దర్శకుడు భావిస్తున్నాడట.

కాగా తొలి భాగంలో చంద్రబాబు రాజకీయ ఎదుగుదల నుండి ఆయన సీఎంగా మారే అంశాల వరకు చూపిస్తారట. అటు రెండో భాగంలో వైయస్ సీఎం అయిన తరువాత జరిగే పరిణామాలను మనకూ చూపించేందుకు దర్శకుడు రాజ్ రెడీ అవుతున్నాడు. ఇక వైయస్ఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా నిర్మాత విష్ణు ఇందూరి, ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ ఇద్దరు మహానాయకుల స్నేహాన్ని ఎలా చూపించనున్నారో తెలియాలంటే మాత్రం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే వరకు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad