Home టాప్ స్టోరీస్ కన్ఫ్యూజన్లో ఇంద్రగంటి! నెక్స్ట్ ఏంటి?

కన్ఫ్యూజన్లో ఇంద్రగంటి! నెక్స్ట్ ఏంటి?

jpg 12

టాలీవుడ్ దర్శకుల్లో ఇంద్రగంటి మోహన కృష్ణకు మంచి గుర్తింపు ఉంది. ఏ స్థాయి సినిమానైన అద్భుతంగా తెరకెక్కించే సామర్ధ్యం కథను కళ్లకు కట్టినట్టు చూపించే వారి రచనా కౌశల్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2004లో గ్రహంణ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఇంద్రగంటి అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన విజయాలను చేజిక్కించుకున్నాడు. తాజాగా వారు దర్శకత్వం వహించిన “వి” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మొదట్లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నప్పటికి ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది.

వాస్తవానికి ఈ సినిమా తరువాత ఇంద్రగంటి నాగచైతన్యతో ఓ సినిమా చేయవలసి ఉంది. అయితే కరోనా కారణంగా పరిస్థితులను తలకిందులయ్యాయి. నాని శేఖర్ కమ్ములతో చేస్తున్న “లవ్ స్టోరీ” సినిమా ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు ఇంద్రగంటి కథను పూర్తి చేసి సిద్ధంగా ఉన్నారు. నాగ చైతన్య సినిమా పూర్తయ్యే వరకూ వెయిట్ చేద్దాం అనుకున్నప్పటికి.. చైతన్య ఆ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా పూర్తి కావడానికి మరో ఏడాది పడుతుంది. ఈ సమయంలో ఓ మిడ్ రేంజ్ సినిమా తీద్దామని అనుకున్నారు. అయితే ఆ సినిమా ఫారిన్ నేపథ్యంలో ఉండటంతో అ ఆలోచనను మధ్యలో విరమించుకున్నారట. ఓ వైపు కాలం గడిచిపోతుంది, మరోవైపు విదేశీ షూటింగ్ లకు అనుమతి లేదు. అందుకే ఈ లోగా ఓ చిన్న సినిమాను ఎక్కించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఏంటి అందులోని నటీనటులు ఎవరన్నది మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వి సినిమా భారీ విజయం సాధిస్తే ఇంద్ర గంట తర్వాత సినిమాపై భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే వి విజయం ఆధారంగానే కొత్త సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad