Home సినిమా టాలీవుడ్ న్యూస్ ‘సన్నాఫ్ ఇండియా’గా మారిన మోహన్ బాబు

‘సన్నాఫ్ ఇండియా’గా మారిన మోహన్ బాబు

Mohan Babu New Movie Son Of India

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇటీవల కాలంలో సినిమాలను చాలా వరకు తగ్గించారు. గతంలో వచ్చిన ‘గాయత్రి’ చిత్రంలో నటించి మెప్పించిన మోహన్ బాబు, ఆ తరువాత హీరోగా మరే సినిమాను చేయలేదు. కాగా సావిత్రి బయోపిక్ చిత్రం ‘మహానటి’లో ఓ కేమియో పాత్రలో నటించాడు. కాగా ఆయన మళ్లీ హీరోగా సినిమాలు చేస్తే చూడాలని చాలా మంది కోరుతున్నారు. అయితే తన అభిమానుల కోసం మరోసారి మేకప్ వేసుకునేందుకు మోహన్ బాబు రెడీ అయ్యాడు.

తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆయన నటించబోయే సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సన్నాఫ్ ఇండియా(Son Of India) అనే ఆసక్తికర టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమాలో ఆయన ఫెరోషియస్ లుక్ ప్రేక్షకులను మళ్లీ పాత మోహన్‌బాబును గుర్తుకు చేసింది. ఇక ఈ సినిమా పోస్టర్ చూస్తే ఇది అచ్చం కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’లా అనిపించింది.

‘బుర్రకథ’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన డైమండ్ రత్నబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను లాక్‌డౌన్ ముగిసిన తరువాత ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా మంచు లక్ష్మీ ప్రసన్న, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో మోహన్ బాబు ఎలాంటి కమ్ బ్యాక్ ఇస్తారో చూడాలి. ఏదేమైనా మంచు అభిమానులకు ఈ సినిమాతో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు మోహన్ బాబు రెడీ అయ్యాడనే చెప్పాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad