Home సినిమా బాలీవుడ్ న్యూస్ మీర్జాపూర్‌ను మళ్లీ పట్టుకొస్తున్న అమెజాన్

మీర్జాపూర్‌ను మళ్లీ పట్టుకొస్తున్న అమెజాన్

Mirzapru 2 Release Date Announced

ఇటీవల కాలంలో సినిమాలకంటే ఎక్కువ ఓటీటీలో వస్తోన్న వెబ్ సిరీస్‌లకే అదిరిపోయే క్రేజ్ ఏర్పడుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు వెబ్ సిరీస్‌లకు రికార్డు స్థాయిలో వ్యూవర్‌షిప్ వస్తుండటం మనం చూశాం. ఇందులో ది లస్ట్ స్టోరీస్, మీర్జాపూర్ వంటి అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్‌లే ముందు స్థానాలను దక్కించుకుంటున్నాయి. అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో పాటు ఆకట్టుకునే కథాంశం ఈ వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.

కాగా యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న మీర్జాపూర్ వెబ్ సిరిస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బూతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే ఆకట్టుకునే కథాంశంతో ఈ వెబ్ సిరీస్‌ను గుర్మీత్ సింగ్ – మిహిర్ దేశాయ్‌లు డైరెక్ట్ చేశారు. మున్నా, గుడ్డుల మధ్య సాగే కథగా ఈ మీర్జాపూర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సీజన్‌లో గుడ్డు భార్య స్వీటీ, అతడి తమ్ముడు బబ్బూను మున్నా చంపి అతడిని దెబ్బతీస్తాడు. ఈ క్రమంలోనే తొలి సీజన్‌కు ముగింపు పలికారు. ఇప్పుడు రెండో సీజన్‌ను అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 23 నుండి టెలికాస్ట్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మొత్తానికి బోల్డ్ కంటెంట్‌ను ఎక్కువ ఇష్టపడుతున్న ఆడియెన్స్ అభిరుచికి అద్దంపట్టేలా మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఉండటంతో ఈసారి దీనికి ఎలాంటి వ్యూవర్‌షిప్ వస్తుందా అని ఎక్స్‌పర్ట్స్ ఎదురుచూస్తున్నారు. ఇక మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో వారి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad