Home సినిమా టాలీవుడ్ న్యూస్ అల్లు అరవింద్ సీక్రెట్ ప్లాన్ : మామూలుగా లేదుగా

అల్లు అరవింద్ సీక్రెట్ ప్లాన్ : మామూలుగా లేదుగా

allu

టాలీవుడ్‌పై థియేటర్ల ప్రభావం ఎంత ఉందో చెప్పడం కష్టం కానీ ఓటీటీల ప్రభావం మాత్రం గట్టిగ ఉంది. లాక్ డౌన్ కారణంగా అన్ని థియేటర్లు మూత పడ్డాయి దీనితో సినిమాల విడుదల దాదాపు లేనట్టే. మరోవైపు కరోనా ఉండటంతో సినిమా షూటింగులు కూడా లేవు. దీంతో భారీ మధ్య తరహ సినిమాలకు బ్రేక్ పడింది. సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లను మరచి  ఓటీటీల వైపు చూస్తున్నారు. గత మూడు నెలల్లో అమెజాన్-నెట్ ఫ్లిక్ష్ వినియోగం దాదాపు 60 శాతం పెరిగింది. భవిష్యత్తులో ఓటీటీ వేదికలు సినిమాలను ప్రభావితం చేస్తాయని ముందే అంచనా వేసిన అల్లు అరవింద్ లాక్‌డౌన్‌ కు ముందుగానే ఆహా యాప్‌ను డెవలప్ చేసి ముందుచూపున్న నిర్మాతగా మరోసారి నిరూపించుకున్నాడు.

ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో ఆహా యాప్‌ కు విపరీతమైన క్రేజ్ ఉంది. వాస్తవానికి తెలుగు నుండి అటు దక్షిణాది భాషల నుండి వచ్చిన మొట్టమొదటి డిజిటల్ మూవీ ప్లాట్ ఫాం ఆహా కావడం విశేషం. ఇప్పటికే ఆహా లో విడుదలైన వెబ్ సీరీస్‌లు ఫుల్ సక్సెస్ అయ్యాయి. కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమతి రామకృష్ణ వంటి చిత్రాలు మంచి లాభలను తెచ్చిపెట్టాయి. దీంతో ఆహా యాప్‌ ను మరింత అభివృద్ధి చేయాలనీ అల్లు అరవింద్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆహా  వేదిక పై చిన్న మధ్య తరహ సినిమాలను విడుదల చేసిన అల్లు అరవింద్ బాలీవుడ్ సినిమాలను కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అల్లుఅరవింద్ బాలీవుడ్ సూపర్ స్టార్, భారీ బడ్జెట్‌తో ఆహా యాప్ కోసం ఒక ప్రత్యేకమైన సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 175 కోట్లు ఉండనుంది అని ఇది వరకే అల్లు అరవింద్ ప్రకటించారు. అయితే ఆ సినిమాకు సంబంధించిన వివరాలను మాత్రం ప్రకటించలేదు. సినిమా థియేటర్లు ప్రారంభం కాకపోయినా ఓటీటీ సత్తా చాటుతోందని ముందే గ్రహించిన ఈ బడా ప్రొడ్యూసర్ మరోసారి తన మార్కును చూపిస్తున్నాడు. భవిష్యత్తులో ఓటీటీ సినీ ఇండస్ట్రీని భారీగా ప్రభావితం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అందుకే బడా నిర్మాతలు ఇప్పుడు దీనిపై దృష్టి సారిస్తున్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad