జీవిత రాజశేఖర్ లపై మెగా ఫాన్స్ మండిపడుతున్నారు. నిన్న మొన్నటివరకు రాజశేఖర్ కున్న ఫాన్స్ ఫాలోయింగ్ ను చూసి జగన్ కుళ్ళు కుంటున్నాడని మాట్లాడిన జీవిత తాజాగా వైసీపీ లోకి కలవడం ఎంతవరకు సభబని.. అంతే కాకుండా మొన్నటి దాకా మెగా ఫ్యామిలీ గొప్పదంటూ.. చిరంజీవి, నాగబాబు మంచివాళ్ళని పొగిడిన వారే ఇప్పుడు వైసీపీ లో చేరి చేరగానే పవన్ కి ప్లానింగ్ లేదంటూ.. అంతా ఒక్కడే చేయాలనుకుంటున్నాడు.. సీనియర్స్ ని పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే మా ఎలక్షన్ సమయం లో నాగబాబు రాజశేఖర్ కి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే.. నాగబాబే కాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా జీవిత రాజశేఖర్ లకు సహాయం చేశాడు. అంతే ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా శివాజీరాజ వర్గం మీద నరేష్ వర్గం గెలుపొందింది. ఈ ఎన్నికల్లో రాజశేఖర్ ఉప అద్యక్షకుడిగా పదవి సంపాదించుకున్నాడు.
‘మా’ ఎన్నికలు పూర్తయి కనీసం రెండు వారలు కూడా తిరగక ముందే వైసీపీ పార్టీ తీర్థం తీసుకున్నారు దంపతులు. మా ఎలక్షన్ జరిగే వరకు గమ్మునున్న జంట.. ఇప్పుడు నాగబాబు కి షాక్ ఇచ్చారు. పవన్ ని విమర్శిస్తున్నారు. జీవిత చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదని.. వీరి అసలు బుద్ధి చూపించారని మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్‌గానే సోషల్ మీడియాలో జీవిత రాజశేఖర్ ల మీద సెటైర్లు వేస్తూ నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. ‘మా’ ఎన్నికల సమయంలో జీవిత రాజశేఖర్ కుటుంబానికి అండగా ఉన్న మెగా ఫ్యామిలీని ఈరోజు విమర్శిస్తున్నారని మెగా ఫాన్స్ మండిపడుతున్నారు. ఇక ఈ కామెంట్స్ కి జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.