
ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేసి కొత్త వివాదానికి తెరతీసిన బ్యూటీ మీరా చోప్రా, వరుసగా ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో యాక్టివ్ పోస్టులు పెడుతూ వస్తోంది. కాగా తాజాగా ఆమె ఓటీటీ సినిమాల గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం చిన్న సినిమాలు మొదలుకొని అన్ని సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో గతకొద్ది రోజులుగా ఆమె కూడా ఓటీటీ సినిమాలు చూస్తూ వస్తోందని తెలిపింది.
అయితే థియేటర్లో చూసే సినిమాకు ఓటీటీలో చూసే సినిమాకు చాలా తేడా ఉందంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఓటీటీలో ఏ సినిమా చూసినా కూడా థియేటర్లో చూసే అనుభూతి వేరే అని ఆమె అంటోంది. నిజానికి థియేటర్లో చూసే ఫీలింగ్ ఓటీటీలో రావడం లేదని, దీంతో సినిమాలను ఇష్టంగా చూడలేకపోతున్నట్లు ఆమె పేర్కొంది. అయితే సినిమాలను ఓటీటీలో ఎంత చూసినా కూడా థియేటర్లో చూసిన మూడ్ ఏమాత్రం రావడం లేదని ఆమె అంటోంది.
దీంతో పలువురు నెటిజన్లు మీరా చోప్రా కామెంట్స్‌పై విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమెలాగే సినిమాలను థియేటర్లో చూడాలని కోరుకుంటుండగా, మరికొందరు ఓటీటీలకే ఓటేశారు. చిన్ననిర్మాతలకు బాసటగా ఓటీటీలు నిలుస్తున్నాయని, వాటిని ఎంకరేజ్ చేయాల్సింది ఇలా నెగెటివ్ ప్రచారం చేయడం మీరా చోప్రాకు ఏమాత్రం మంచిది కాదని పలువురు అంటున్నారు.