Home సినిమా గాసిప్స్ పవన్ కోసం రవితేజ సాయం

పవన్ కోసం రవితేజ సాయం

Pawan 2485

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమా ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా, తర్వాత క్రిష్ మరియు హరీష్ శంకర్ సినిమాలు పట్టాలు ఎక్కనున్నాయి ఉన్నాయి. దర్శకుల విషయంలో పవన్ కళ్యాణ్ ఏనాడు వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ను చూసి అవకాశాలు ఇవ్వలేదు. డైరెక్టర్ బాబీ మరియు హరీష్ శంకర్ చిన్న దర్శకులు అయినప్పటికీ తన మిత్రుడు రవితేజ రికమండేషన్ మేరకు వారికి అవకాశాలు ఇచ్చాడు. హరీష్ శంకర్ రవితేజకు మిర్చితో అద్భుతమైన హిట్ అందించగా, మాస్ మహారాజా ఈ డైరెక్టర్ ను పవన్ కళ్యాణ్ కు పరిచయం చేశాడు. తరువాత వీరి కలయికలో గబ్బర్ సింగ్ వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది.

ఇటీవల రవితేజ ఓ యువ దర్శకుడిని పవన్ కళ్యాణ్ కు పరిచయం చేసాడంటా ! అతడి మేకింగ్ నచ్చడంతో పవన్ కళ్యాణ్ కలవమని మాస్ మహారాజ చెప్పినట్టు తెలుస్తుంది. కీ ఆ దర్శకుడు ఎవరో కాదు…. రవితేజతో క్రాక్ సినిమా తీస్తున్న గోపిచంద్ మలినేని. వరస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు, గోపిచంద్ మలినేని డాన్ శీను, బలుపు వంటి హిట్ సినిమాలను అందించి మాస్ రాజా కెరీర్ ను గాడిలో పెట్టాడు. మంచి క్యాలిబర్ ఉన్న డైరెక్టర్ కావడంతో పవన్ కు ఈ దర్శకుడిని పరిచయం చేశాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రవితేజ వ్యక్తిగతంగా పవన్ కి ఫోన్ చేసి మరీ ఈ దర్శకుడు కథ వినాలని కోరారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే పవన్ ని దృష్టిలో పెట్టుకొని గోపీచంద్ మలినేని ఓ కథను రాస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. ఈ సినిమాలను పూర్తి చేసిన తర్వాతనే గోపీచంద్ సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. గోపీచంద్ మలినేని వంటి ఎంటర్టైన్మెంట్ దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా అంటే భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. ఈ వార్తల పై ఇప్పటికీ గోపీచంద్ స్పందించలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా టీజర్ సెప్టెంబర్ 2న విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad