
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. గీతాగోవిందం చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసిన తరువాత ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అయితే ఈ సినిమా ఆర్థికనేరాల బ్యాక్‌డ్రాప్‌తో వస్తుండటంతో ఈ సినిమాలో మాస్ అంశాలు ఏ మేరకు ఉంటాయో అనే సందేహం అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమాలో మాస్ అంశాలకు ఎలాంటి లోటుండదని చిత్ర యూనిట్ అంటోంది. మహేష్ గత చిత్రాల్లో మాస్ అంశాలు పుష్కలంగా ఉండటంతో, ఇప్పుడు ఆ ఫార్ములాను మరోసారి రిపీట్ చేసి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చిత్ర యూనిట్ చేస్తోంది.
ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడని, ఈ లుక్‌తో మహేష్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ కీర్తి సురేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించి, ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు మహేష్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.