రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో కింగ్ నాగార్జున నటనలో సీక్వెల్ మూవీగా తెర కెక్కపోతున్న సినిమా ‘మన్మథుడు 2 ’. ఈ చిత్ర షూటింగ్ పనులు మొదలయ్యాయి. ఈ సినిమాను మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకం ఫై అక్కినెని నాగార్జున , పి.కిరణ్ నిర్మిస్తున్నారు. సెట్స్ మీదకు వెళ్ళిన సినిమాకు సీనియర్ రచయిత సత్యానంద్ దర్శకులైన రాహుల్ రవీంద్రన్ కి స్క్రిప్ట్ ని అందచేయగా , అక్కినేని అమల ఫస్ట్ క్లాప్ కొట్టారు. నాగ చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ విదంగా మొదలైన మొదటి షాట్ ను దేవుళ్ళ పటాల మీదుగా చిత్రీకరించారు.
హైదరాబాద్ లో మొదలైన ఈ షూటింగ్ కి అక్కినేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అమల, నాగ చైతన్య , సుమంత్, సుషాంత్, నాగ సుశీల, యార్లగడ్డ సురేంద్ర కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. హైదరాబాద్ సినిమా షెడ్యూల్ పూర్తి చేసుకొని ఆ తర్వాత చిత్ర షూటింగ్ పోర్చుగల్ లో చేయనున్నారు. మన్మధుడు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడారు. ‘చి || ల || సౌ సినిమా అక్కినేని నాగార్జున చూసి బాగుందన్నారు. అందుకే ఈ సినిమాను అన్నపూర్ణ ద్వారా విడుదల చేశారు. ఆ సినిమాను చూసిన రోజే నాగార్జున నా డైరెక్షన్ లో సినిమా చేస్తానని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారమే నాకు సినిమాను చేసే అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞుడిని’ అని చెప్పారు.
నటీనటులు: కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెలకిషోర్,రావు రమేష్, నాజర్, ఝాన్సీదేవదర్శిని తదితరులు.
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి.కిరణ్
బ్యానర్ : మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
సంగీతం : చైతన్య భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
స్క్రీన్ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్
డైలాగ్స్: కిట్టు విస్సా ప్రగడ, రాహుల్ రవీంద్రన్