మన్మధుడు సినిమా భారీ హిట్ సాధించిగా, సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా రాబోతున్న విషయం తెలిసిందె. అయితే ఈ సినిమా ఈ మధ్యే సెట్స్ మీదకు వెళ్లగా.. అక్కినేని అమల ఫస్ట్ క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. అక్కినేని చైతన్య స్విచ్ ఆన్ చేశారు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రదారులం మేమె అంటూ ఓ సెల్ఫీ పిక్ ను నాగార్జునా ట్విట్టర్ లో పొందుపరిచాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది. తారలందరూ ఒకే చోట చేరడంతో కనుల విందుగా నున్న ఫొటోను చూసిన అభిమానులు లైక్ , షేర్, కామెంట్స్ తో మరింత అభిమానాన్ని తెలియచేస్తున్నారు.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో కింగ్ నాగార్జున నటనలో సీక్వెల్ మూవీగా తెర కెక్కపోతున్న సినిమా ‘మన్మథుడు 2 ’. ఈ సినిమాను మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై అక్కినేని నాగార్జున, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. నేను నా మన్మధుడు2 ఫ్యామిలి అంటూ కింగ్ పంచుకున్న పిక్ లో చూస్తే నాగార్జున రకుల్ తో పాటు, వెన్నెల కిషోర్, దర్శకుడు రాహుల్ రవీంద్ర, రావు రమేశ్, లక్ష్మి, ఝాన్సీ, దేవదర్శిణి, చైల్డ్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. మన్మధుడు 2 బ్యాచ్ పిక్ చూసి మీరు ఓ లైక్ వేసుకోండి.
నటీనటులు: కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెలకిషోర్,రావు రమేష్, నాజర్, ఝాన్సీదేవదర్శిని తదితరులు.
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి.కిరణ్
బ్యానర్ : మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
సంగీతం : చైతన్య భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
స్క్రీన్ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్
డైలాగ్స్: కిట్టు విస్సా ప్రగడ, రాహుల్ రవీంద్రన్