Home టాప్ స్టోరీస్ టాలీవుడ్‌ను ఏలుతున్న మలయాళ రీమేక్‌లు.. మనవాళ్ల సత్తా ఏమైంది?

టాలీవుడ్‌ను ఏలుతున్న మలయాళ రీమేక్‌లు.. మనవాళ్ల సత్తా ఏమైంది?

Malayalam Remakes Ruling Telugu Cinema

టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రాలు ఎక్కువ శాతం రీమేక్‌లకు సంబంధించినవే ఉన్నాయి. అయితే కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే రీమేక్ చిత్రాన్ని కూడా బ్లాక్‌బస్టర్ చేస్తారు ఆడియెన్స్. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఇదే పంథా కొనసాగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ చిత్రాలను ఇతర భాషల్లో రీమేక్ చేసి అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు పలువురు దర్శకనిర్మాతలు. ఇప్పుడు ఇదే స్ట్రాటెజీని మన తెలుగు దర్శకనిర్మాతలు కూడా ఫాలో అవుతున్నారు.

ముఖ్యంగా మలయాళంలో తెరకెక్కి ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయిన పలు చిత్రాలను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రీమేక్ చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మలయాళంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే సినిమాను కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను ఆయన సొంతం చేసుకోగా, ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను నటింపజేయాలని చరణ్ భావిస్తున్నాడు.

గతకొంత కాలంగా టాలీవుడ్‌లో తీవ్రంగా చర్చ జరుగుతోన్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ త్వరలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో పవన్, రానాలను నటించనున్నటు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక ఈ సినిమాతో పాటు ‘జోసెఫ్’ అనే సినిమాను తెలుగులో హీరో రాజశేఖర్ రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ‘కప్పెల’ అనే సినిమాను కూడా టాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇలా స్టార్ హీరోలతో సంబంధం లేకుండా కేవలం కంటెంట్‌తోనే దుమ్ములేపిన ఈ సినిమాలను ఇప్పుడు టాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటాయో తెలియాలంటే మాత్రం ఆయా సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad