అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘మజిలీ’. పెళ్ళికి ముందు గ్లామర్ రోల్ లో కనిపించిన అమ్మడు, పెళ్లి తరువాత చేసే సినిమాలు చాలా స్పెషల్ గా సెలెక్ట్ చేసుకుంటుంది. భర్త నాగ చైతన్య తో కలిసి నటిస్తున్న నాలుగో సినిమా, పెళ్లి తరువాత చేస్తున్న మొదటి సినిమా కావటంతో ఎలాంటి పాత్ర చేయబోతుందోనని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అభిమానులంతా.. నాగ చైతన్య, సామ్, దివ్యాంశకౌషిక్ చుట్టూ తిరిగే కథ మజిలీ.. ఈ సినిమా సాంగ్స్, టీజర్ ఇప్పటికే విడుదలై ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్ లోకి వెళ్తే .. నాగ చైతన్య, దివ్యాంశ కౌశిక్ ప్రేమించుకుంటారు. ఏవో కొన్ని సంఘటనలతో విడిపోవడం.. చైతన్య భగ్న ప్రేమికుడై జీవితంలో కోలుకోలేక.. బాధ పడటం చూడవచ్చు. సమంత,నాగ చైతన్య పెళ్లి జరగటం.. ఇష్టపడని భర్త, భర్త మనసులో చోటు సంపాదించుకోలేక, భర్త ను బేవార్స్ అని అందరు తిడుతుంటే .. భర్తకు సపోర్ట్ ఇస్తూ సగటు ఇల్లాలుగా తన బాధ్యతను పూర్తి చేసే భార్య పాత్రలో సమంత నటన అద్భుతంగా ఉంది. తాగుడికి బానిసైన భర్తను అందరు ఛీదరించుకుంటుంటే.. రావు రమేష్ తో నాగచైతన్య గూర్చి ‘మీరు తాను మందు మానేస్తే బాగుందనుకుంటున్నారు.. కానీ నేను తన మనసుకు తగిలిన దెబ్బ మానిపోతే బాగుందనుకుంటున్నాను’ అనే సమంత డైలాగ్ అతని గుండెల్లో దాగిన భాదను ఎంతగా అర్ధం చేసుకుందో తెలుస్తుంది.
సమంత చై మనసులో చోటు సందించుకుంటుందా? చైతన్య మారతాడా? అతని మనుసుకైనా గాయాన్ని ఎలా మాన్పిస్తుంది? బేవార్స్ గా ఉన్న అతనిని మార్చి, గొప్ప వ్యక్తిగా ఎలా చేస్తుందనేది కథలో చూపించబోతున్నట్లు ట్రైలర్ పట్టి అర్ధమవుతుంది. మజిలీలో సమంత పాత్ర అట్రాక్షన్ గా కనిపిస్తుంది. సమంత ఏం మాయ చేస్తుందో .. నాగ చైతన్య జీవితము చివరి మలుపు ఏంటో.. మజిలీ లో చూపించనున్నారు. మార్చి 31 తేదీన హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు. ఈ వేడుకలో ‘మజిలీ’ ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ వేడుకకు సమంత, నాగ చైతన్య, నాగార్జున, వెంకటేష్ తదితరులు హాజరయ్యారు. ఏప్రిల్ 5వ తేదీన విడుదలకు సన్నాహాలు పూర్తయ్యాయి.