Home సినిమా 'మజిలీ' మూడు రోజుల కలెక్షన్ ఎంతో తెలుసా? ..!

‘మజిలీ’ మూడు రోజుల కలెక్షన్ ఎంతో తెలుసా? ..!

షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా గా తెరకెక్కిన సినిమా మజిలీ. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రలు పోషించారు. నాగ చైతన్య, సమంత పెళ్లి తరువాత జంటగా నటించిన సినిమా కావడంతో అందరి ఆశలు మజిలీ వైపుగానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. నాగ చైతన్య ఒక క్రికెటర్ గా, భగ్నమైన ప్రేమికుడిగా, సామ్ కి భర్తగా కనిపించాడు. నాగ్ భార్యగా సమంతా… ప్రియురాలుగా దివ్యంకా కౌశిక్ నటించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా.. క్లైమాక్ అందరి గుండె బరువెక్కేలా చేసింది అనడంలో అతిసేయోక్తి లేదు.

మజిలీ విడుదలై ఇప్పటికి మూడు రోజులు కావస్తున్నా మజిలీ వైపుగా గానే అందరి చూపులు సాగుతున్నాయి. సినిమా విడుదల తరువాత సెలువు దినాలు కావడంతో భారీగానే కలెక్షన్ చేపట్టిందని చెప్పవచ్చు ఒక్కసారి వరల్డ్ వైస్ కలెక్షన్ లోకి వెళ్తే.. 17.35 కోట్లు తెచ్చిపెట్టింది. నైజాం లో 5.35 కోట్లు , రాయలసీమ 1.77 కోట్లు, వైజాగ్ 1.94 కోట్లు, ఈస్ట్ , వెస్ట్ లో కలిపి 1.54 కోట్లు, కృష్ణ 1.01 కోట్లు, గుంటూరు 1.24 కోట్లు, నెల్లూరు 0.40 కోట్లు, కర్ణాటక 1.15 కోట్లు ,యూఎస్ఏ 2.25 కోట్లు కొల్లగొట్టింది.. ఇక మునుముందు ఎంత సంపాదించి పెడుతుందో నిర్మాతలకు చూడాలి.

majili three days collection
majili three days collection

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad