Home సినిమా 'మజిలీ' మస్తుగా మెప్పించింది ( మూవీ రివ్యూ)

‘మజిలీ’ మస్తుగా మెప్పించింది ( మూవీ రివ్యూ)

నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, సమంతా, దివ్యాంశ కౌశిక్ , పోసాని మురళి కృష్ణ ,రావురమేష్ తదితరులు

షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్నుకోరి తర్వాత లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా గా తెరకెక్కిన సినిమా మజిలీ. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రలు పోషించారు. నాగ చైతన్య , సమంత పెళ్లి తరువాత జంటగా నటించిన సినిమా కావడంతో అందరి ఆశలు మజిలీ వైపుగానే ఉన్నాయి. నాగ చైతన్య ఒక క్రికెటర్ గా, భగ్నమైన ప్రేమికుడిగా, సామ్ కి భర్తగా కనిపించాడు. నాగ్ భార్యగా సమంతా… ప్రియురాలుగా దివ్యంకా కౌశిక్ నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ట్రైలర్ టీజర్ అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.. భారీ స్థాయిలో ఈరోజు విడుదలైన సినిమా ఎలా ఉందో .. ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం రండి..

కథలోకి వెళ్తే…

పూర్ణ పాత్రలో నాగ చైతన్య , శ్రావణి పాత్రలో సమంత , అన్షు పాత్రలో దివ్యాంశ కౌశిక్ నటించారు. ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ తో జీవితాన్నిమలిచిన కథ గా చెప్పవచ్చు.

ఫస్ట్హాఫ్..

 నాగ చైతన్య ఒక మంచి క్రికెటర్ కావాలనుకుంటారు. టీనేజ్ వయస్సులో గోల్ పెట్టుకుని శ్రమిస్తున్న సమయంలో అన్షు ప్రేమలో పడతాడు. ప్రాణమే ఆమె అనేంతగా పూర్ణ ప్రేమిస్తాడు. ఆమె ప్రేమలో మునిగిపోయిన పూర్ణకు అనుకోకుండా అన్షు దూరమవుతుంది. అంతే ఇక జీవితం ఎలా నిర్ణయించుకోవాలి అర్ధం కాక తాగుడుకు బానిసై తనను తాను కోల్పోతాడు. అలా తాగుడుకు బానిసై సోంబేరి గా తయారైన అతనిని ఇంట్లో వాళ్ళు, చుట్టూ పక్కల వాళ్ళు అందరు చీదరించుకుంటారు. ఆ సమయంలో పూర్ణ ఏమైపోతాడోనని ఇంట్లో వాళ్లంతా ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. ఈ విధంగా సమంత ఇంటర్వెల్ కి ముందుగానే , చైతు జీవితంలోకి అడుగుపెడుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మాయ లవ్ స్టోరీలో మునిగిపోతాడు హీరో..

సెకండాఫ్ ..

పూర్ణ , శ్రావణి ల నూతన జీవితం మొదలవుతుంది. కానీ అన్షు ను మరచిపోలేక.. శ్రావణిని దూరం పెడతాడు.. నా మనసులో ఎప్పటికి చోటు సంపాదించుకోలేవంటూ సమంతకు వార్నింగ్ కూడా ఇస్తాడు. మద్యానికి బానిసై భర్తను మార్చుకునే ప్రయత్నములో శ్రావణి ఉంటుంది. ఎంతగా ఆమె ట్రై చేస్తున్న, పూర్ణ అంతగా దూరం పెడుతుంటాడు. భార్యగా పూర్ణను అర్ధం చేసుకొని మనసుకు తగిలిన గాయాన్ని పోగొట్టాలని, తన ఆశయాన్ని దగ్గరకు చేయాలనీ సామ్ తాపత్రయ పడుతుంది. చివరకు పూర్ణ భార్య డబ్బులిస్తే తాగే స్టేజికి వస్తాడు.

దివ్యాంశ కౌశిక్ ఏమైపోతుంది? సమంత, నాగ్ జీవితంలోకి ఎందుకు వస్తుంది? సమంత ప్రేమను అర్ధం చేసుకుంటాడా? సమంత, నాగ్ ల మధ్య ప్రేమ చిగురిస్తుందా? చివరకు అనుకున్న ఆశయాన్ని చేరుకోగలుగుతాడా ? లేదా? అనే వెండి తెర మీదే చూడాలి..

నటి నటులు..

చైతూ, సమంత ఒకరంటే ఒకరు పోటీగా నటించారని చెప్పవచ్చు. సమంత నటన థియేటర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కదిలించిందని చెప్పవచ్చు. భర్త అంటే ప్రేమతో, భర్త కోసమే తపన పడే భార్యగా సమంత ఒదిగిపోయింది చెప్పవచ్చు. చైతూ విషయానికొస్తే.. జీవితంలో ఎదగాలనుకొని జీవితాన్ని కోల్పోయి మద్యానికి బానిసై మధ్య తరగతి యువకుడిగా బాగా నటించాడు. టీనేజ్ యువకుడిగా, మధ్య వయసు వ్యక్తిగా నటించిన తీరు అతని కెరియర్ కి మలుపు తిప్పేలా ఉందని చెప్పవచ్చు.

బలం..

సినిమాకి చైతు , సామ్ ల నటన బలం. క్లైమాక్ అందరికి కన్నీళ్లు పెట్టించింది చెప్పవచ్చు.
డైరెక్షన్
సినిమాటోగ్రఫీ
సంగీతం

సాంకేతికపరంగా:

నిన్ను కోరి లాంటి మంచి లవ్ స్టోరీ ని అందించిన శివ నిర్వాణ  డైరెక్షన్ ఈ సారి కూడా మంచి కథతో ముందుకు వచ్చాడని చెప్పక తప్పదు. ప్రేక్షకులకు మజిలీ అందించడంలో తగు న్యాయం చేశాడని చెప్పవచ్చు. గోపి సుందర్ సంగీతం హైలెట్.. ప్రతి పాట గుండెకు హత్తుకునేలా ఉన్నాడని చెప్పవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ , సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

చివరగా..

మజిలీ సినిమా చైతూ, సమంత కి ఒక గొప్ప సినిమా. అటు యూత్ కి నచ్చేలాగా , ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా ఉందని చెప్పవచ్చు. అన్నివర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంది సినిమా.

బ్యానర్: షైన్ స్క్రీన్స్
రచన, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాత: సాహు గరపతి
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ

Rating : 3.5/5.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad