షైన్ స్క్రీన్స్ నిర్వహిస్తున్న శివ నిర్వాణ దర్శకత్వములో ‘మజిలీ’ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. అక్కినేని నాగ చైతన్య, సమంత కాంబినేషన్లో వివాహం తర్వాత ప్రేక్షకులను అలరించబోతున్న సినిమా కావడంతో అందరు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను భారీస్థాయిలో ఏప్రిల్ 5వ తేదీన చిత్రాన్ని విడుదల చేయుటకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరవుతుండటంతో చిత్ర ప్రమోషన్స్ ల వేగాన్నిపెంచారు చిత్ర యూనిట్. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ , టీజర్ , ట్రైలర్ , లిరికల్ పాటలకు అనూహ్యమైన స్పందన లభించింది.
ఈ చిత్రాన్ని ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు యూఎస్ లోనూ మజిలీ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయుటకు కసరత్తులు మొదలయ్యాయి. నాగచైతన్య.. సమంత జంటగా రాబోతున్న సినిమా కావడంతో మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. చైతు ఒక క్రికెటర్ గా, భగ్నమైన ప్రేమికుడిగా, సామ్ కి భర్తగా కనిపించనున్నాడు. నాగ్ భార్యగా సమంతా… ప్రియురాలుగా దివ్యంకా కౌశిక్ నటించారు. ఈ చిత్రాన్ని వరల్డ్ వైస్ గారిలీజ్ చేయనున్నారు. ఓవర్సీస్ లో సుమారు 150 లొకేషన్స్ లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వాటికి ప్రేక్షకుల రెస్పాన్స్ అదిరిపోయింది. అందుకే తప్పకుండా ఈ చిత్రం గట్టి హిట్ సాదిస్తుందని టాక్ ఉంది.
Read also: