మజిలీ సినిమా గూర్చే కొన్నాళ్లుగా ఇండస్ట్రీ అంతా కోడై కూస్తుంది. అక్కినేని చైతన్య, సమంత పెళ్లైన తరువాత జంటగా నటిస్తున్న సినిమా కావడంతో అందరి చూపులు మజిలీ వైపే. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య చైతూకు ఎలాంటి విజయం కూడా లేదు. సమంత విషయానికొస్తే పెళ్లి తరువాత కథను చూస్ చేసుకోవడంలో ఎంతో జాగ్రత్త వహిస్తుంది. అంతే ఇక అభిమానులు సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా లవ్ కమ్ ఫ్యామిలి ఎంటర్టైన్మెంట్ కావడంతో అన్ని వర్గాల వారికి నచ్చుతుందని అక్కినేని కుటుంబం, చిత్ర యూనిట్ వారు నమ్ముతున్నారట. తాజాగా చిత్ర సెన్సార్ పూర్తయింది. ఇక సెన్సార్ బోర్డు వారు కూడా ఎలాంటి కట్స్ లేకుండా యూ బై ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో అంచనాలు పెరిగాయి అందరికి. ప్రస్తుతం సెన్సార్ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది.
మజిలీ ఏప్రిల్ 5 తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వారు ప్రమోషనల్ పనుల్లో వేగాన్ని పెంచారు. విడుదల కాబోయే ముందు దంపతులిద్దరూ తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొన్నారు. సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా వర్కవుట్ అయ్యాయని యూత్ ను, ఫ్యామిలీ ని త్వరగా రీచ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. చిత్రం విజయం వరించడం ఖాయమని నమ్మకంతో ఉన్నారట నాగ చైతన్య.
మజిలీ లో చైతు క్రికెటర్ పాత్రలో నటించారు. చై జీవితంలో ఇద్దరు అమ్మాయిలుంటారు. ఒక అమ్మాయిని ప్రేమించి , మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సోంబేరిగా తయారైన తన జీవితంలోకి అడుగిడిన భార్య తనను ఎలా మార్చుకుంటుంది. చై మజిలీ ని తెలియ చేసే చిత్రమే ఇది. చై జీవితంలో ప్రియురాలిగా దివ్యాంశ కౌశిక్ , భార్యగా సమంత నటిస్తుంది.