Home సినిమా ఆ ఘటన చాలా భయానకం అంటోన్న మహేష్

ఆ ఘటన చాలా భయానకం అంటోన్న మహేష్

mahesh babu 3

లెబనాన్ దేశంలో సంభవించిన పేలుడు యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆ దేశ రాజధాని బీరట్‌లో సంభవించిన భారీ పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను కుదిపేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే అది ఎలాంటి తీవ్రవాద దాడి కాదని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. కేవలం ఓ గోడౌన్‌లో సంభవించిన పేలుడు మాత్రమేనని లెబనాన్ ప్రభుత్వం తెలియజేసింది.

ఓ గోడౌన్‌లో దాచివుంచిన 2700 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ ఈ విస్ఫోటానికి కారణం అయ్యిందని ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. ఇక ఈ భారీ పేలుడుకు సంబంధించి పలువురు సెలబ్రిటీలు తమదైన కామెంట్స్ చేశారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఈ ఘటనపై ట్వీట్ చేశారు. ఈ భారీ పేలుడు నిజంగా భయానకంగా ఉందని, అందులో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ఉంటుందని మహేష్ తెలిపాడు.

ఇక ఈ పేలుడు ఘటనలో 2.5 లక్షల మంది నిరాశ్రయులుగా మారారని, 100 మందికి పైగా మరణించారని, సుమారు 4000 మంది గాయాలపాలయ్యారని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఏదేమైనా ఇలాంటి భారీ పేలుడుతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad