Home సినిమా బర్త్‌డే గిఫ్ట్ రెడీ చేస్తోన్న మహేష్

బర్త్‌డే గిఫ్ట్ రెడీ చేస్తోన్న మహేష్

mahesh babu bday gift

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. కాగా ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశాడు. గీతాగోవిందం వంటి బ్లాక్‌బస్టర్ మూవీని అందించిన దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను చేయబోతున్నట్లు మహేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ సర్‌ప్రైజ్‌ను మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని టైటిల్ ట్రాక్ లేదా మహేష్ వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా కథను తెలిపే పాటను చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అయితే మహేష్ బర్త్‌డే కానుకగా ఈ సినిమా నుండి ఎలాంటి గిఫ్ట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అటు మహేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకధీరుడురాజమౌళితో చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజ్ ఏదైనా మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఉంటుందో లేదో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad