Home సినిమా టాలీవుడ్ న్యూస్ పుట్టినరోజు నాడు మహేష్‌కు భారీ మూల్యం?

పుట్టినరోజు నాడు మహేష్‌కు భారీ మూల్యం?

Mahesh Babu To Be Fined Huge For Not Wearing Mask

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు 9న తన పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ చేసిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే మహేష్ తన పుట్టినరోజును కేవలం కుటుంబ సభ్యుల మాత్రమే జరుపుకున్నాడు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా మహేష్ ఓ మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో తనవంతు పాత్రను నిర్వహించాడు.

కాగా ఇప్పుడు ఇదే మహేష్ కొంప ముంచనున్నట్లు తెలిసింది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహేష్ ఓ మొక్కను నాటుతూ కనిపించాడు. అయితే ఆయన మొహానికి మాస్క్ వేసుకోకపోవడంతో ఇప్పుడు ఇది వివాదాలకు దారితీస్తుంది. సెలబ్రిటీ అయ్యి ఉండి ఇలా మాస్క్ లేకుండా కనిపించి ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడంటూ మహేష్‌కు జరిమానా విధించేందుకు ప్రభుత్వ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇలా ఓ సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తి కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మొహానికి మాస్క్ లేకుండా కనిపించి తమ ఫ్యాన్స్‌ను తప్పుదారి పట్టించడం ఏమాత్రం అంగీకరించే విషయం కాదని వారు అంటున్నారు.

ఇక మహేష్ పుట్టనరోజున వరల్డ్ రికార్డు క్రియేట్ చేశామని సంతోషపడుతున్న ఫ్యాన్స్‌కు ఇలా ప్రభుత్వ అధికారులు మహేష్‌కు జరిమానా విధిస్తున్నారనే విషయంతో అందరూ అవాక్కవుతున్నారు. ఇక సినిమాల పరంగా మహేష్ తన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad