Home సినిమా కోలీవుడ్ ను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు !

కోలీవుడ్ ను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు !

mahesh babu thumb

టాలీవుడ్ టాప్ యాక్టర్స్ లో మహేష్ బాబు ఒకరు. 21 వసంతాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో విజయాలను, బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకున్నాడు. చిన్న వయస్సులోనే సినీరంగ ప్రవేశం చేసిన మహేష్ అతి తక్కువ సమయంలో టాలీవుడ్ టాప్ హీరోగా అవతరించాడు. పోకిరి, మురారి వంటి హిట్లతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మహేష్ బాబు కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తాడని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ప్రిన్స్‌ మహేష్ బాబు కూడా ప్రయోగాలు జోలికి వెళ్ళకుండా చాలా వరకు సేఫ్ జోన్ లోనే సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన “శ్రీమంతుడు” సినిమాతో తను సందేశాత్మకమైన కూడా సినిమాలు చేయగలని నిరూపించారు. ప్రస్తుతం మహేష్‌బాబు పరశురామ్ దర్శకత్వంలో కమర్షియల్ ఫార్మాట్ లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ మహేష్‌ సరసన నటించనుంది. మహేష్ బాబుకు సౌత్ ఇండియా లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ మహేష్ ఇప్పటివరకు టాలీవుడ్ ను ధాటి ఇతర ఇండస్ట్రీలో సినిమాలు చేయలేదు. గతంలో తమిళ దర్శకుడు మురగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు స్పైడర్‌ సినిమా చేసిన కలెక్షన్లు రాబట్టలేక తమిళనాడు బోల్తా కొట్టింది. మొదటి ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయినా మహేష్ ఇప్పుడు కోలీవుడ్ పై మరోసారి దండయాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఖైదీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనకరాజు దర్శకత్వంలో మహేష్ నటించనున్నారని విషయం ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. లోకేష్ కనకరాజుకు వైవిద్యమైన కథలు తెరకెక్కిస్తారనే మంచి పేరుంది. లోకేష్ మహేష్ కోసం ప్రత్యేకంగా ఒక స్టోరీ ని రెడీ చేసి ఒప్పించినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇదే నిజమైతే మహేష్ బాబు కోలీవుడ్ కు దిమ్మ దిరిగే షాక్ ఇవ్వడానికి రెడీ అయినట్లే. ఈ సినిమాపై అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 9న మహేష్‌బాబు పుట్టిన రోజు నాడు సర్కారు వారి పాట టైటిల్‌ ట్రాక్‌ని రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది.. ప్రస్తుతం సాంగ్‌కి సంబంధించిన ఫైనల్‌ ట్రీట్‌మెంట్‌ జరుగుతుందట. ఈ సినిమాకి ఎస్.ఎస్‌.థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad