Home సినిమా చిరు రికార్డును మట్టిలో కలిపేసిన మహేష్

చిరు రికార్డును మట్టిలో కలిపేసిన మహేష్

Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గతకొంత కాలంగా తెరకెక్కిస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలుస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేశారు.

ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర రికార్డును పటాపంచలు చేసింది. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి చిత్రం కన్నడలోనూ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను అక్కడ టీవీలో టెలికాస్ట్ చేయగా, 6.3 టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు మెగాస్టార్ నెలకొల్పిన రికార్డును మహేష్ అధిగమించాడు.

సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని కన్నడలో డబ్ చేసి టీవీలో టెలికాస్ట్ చేయగా దానికి ఏకంగా 6.5 టీఆర్పీ రేటింగ్ దక్కింది. ఈ లెక్కన చిరంజీవి నెలకొల్పిన రికార్డును మహేష్ బద్దలుకొట్టాడని మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక కన్నడలో డబ్ అయిన చిత్రాల్లో రామ్ చరణ్ రంగస్థలం 6, గోతాగోవిందం 5.6 టీఆర్పీ రేటింగ్‌లను దక్కించుకున్నాయి. అటు టాలీవుడ్‌లోనూ సరలేరు నీకెవ్వరు చిత్రం 23.4 టీఆర్పీ రేటింగ్‌తో ఏకంగా బాహుబలి 2(22.7) రికార్డును బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad