Home సినిమా టాలీవుడ్ న్యూస్ మ‌హేశ్ సినిమాల్లో ఆ సీన్ మాత్రం త‌ప్ప‌నిస‌రి

మ‌హేశ్ సినిమాల్లో ఆ సీన్ మాత్రం త‌ప్ప‌నిస‌రి

mahesh thumb 1

ఒక్కో స్టార్ హీరోకి ఒక్కో రేంజ్ ఉంటుంది. కొంద‌రికి యాక్ష‌న్స్ సీన్స్ బాగా వ‌ర్కౌట్ అవుతాయి. ‌రికొంద‌రికి సాంగ్స్‌, ఫైట్స్ స‌రిగ్గా సెట్ అవుతాయి. ఇంకొంద‌రికి సెంటిమెంట్ సీన్స్ కుదురుతాయి. చిరంజీవికి డ్యాన్స్‌, బాల‌కృష్ణ‌కు డైలాగులు, వెంక‌టేష్ కు సెంటిమెంట్, ప్ర‌భాస్‌కు ఫైట్స్ , నాగార్జున‌కు రొమాంటిక్ సీన్స్ సెట్ అవుతూ ఉంటాయి. ఇక స్టార్ ఇమేజ్‌, రేంజ్‌ని బ‌ట్టి క‌థ‌లు అల్లుతారు ద‌ర్శ‌కులు. త‌ద్వారా వాళ్ల పాత్ర‌ల‌ను మ‌రింత ఎలివేట్ చేస్తారు. ఇక సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు విష‌యానికొస్తే…ఎప్పుడూ కొత్త‌ద‌నంతో ఆలోచిస్తూ డిఫ‌రెంట్ స్టైల్ లో సినిమాలు చేస్తుంటాడు. బాక్సాఫీస్ వేగాన్ని పెంచుతూ ఉంటాడు. ఇక మ‌న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబుకు కూడా అత‌ని ప్ర‌తీసినిమాలో ఒక రొటీన్ సీన్ ఉంటుంది.

అదే ప‌రిగెత్తే సీన్. పోకిరి సినిమాతో స్టార్ట్ అయిన ఈ మ్యాజిక్ త‌ర్వాత నుంచి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పోకిరి ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌లో మొద‌లుపెట్టిన మ‌హేష్ ప‌రుగులు..ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉన్నాయి. ప‌రిగెత్తే సీన్ బాగా ఎలివేట్ అయ్యింది. దీంతో దాన్ని సెంటిమెంట్‌లా కొన‌సాగిస్తున్నారు అని అంటుంటారు. అతిధి సినిమాలో ర‌న్నింగ్ సీన్ ఉంటుంది. సైనికుడు సినిమాలో కూడా ఉంటుంది. ఖ‌లేజాలో త్రివిక్ర‌మ్ ప‌రుగులు పెట్టిస్తే….. బిజినెస్ మ్యాన్ లోనూ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడు పూరీ జ‌గ‌న్నాథ్‌. అంత ఎందుకు శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సీత‌మ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా మ‌హేష్ ప‌రుగులు క‌నిపిస్తాయి. శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి సినిమాల్లోనూ మ‌హేష్‌కు ర‌న్నింగ్ సీన్స్ పెట్టారు. మొన్న సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రూ మూవీతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు మ‌హేశ్‌బాబు. చివ‌రికి ఈ సినిమాలో కూడా ర‌న్నింగ్ సీన్ పెట్టాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి.

ప్ర‌‌స్తుతం మ‌హేశ్ స‌ర్కారీ వారి పాట చేస్తున్నాడు. మ‌రి స‌ర్కారీవారి పాట సినిమాలో మ‌హేశ్‌తో ….ద‌ర్శ‌కుడు పరుశురామ్ ప‌రుగులు పెట్టిస్తున్నాడో లేదో చూడాలి. ఇలా ఏ సినిమా తీసుకున్నా మ‌హేశ్ ఏదో ఒక సంద‌ర్భంలో ప‌రిగెడుతూ క‌నిపిస్తాడు. అది ఓ స్పెషాలిటీ గా ఉంటుంది. ఇక డైలాగ్స్‌, యాక్ష‌న్ , ఫైట్స్ ఇవ‌న్నీ మ‌రో లెవెల్లో ఉంటాయి. కొంద‌రు దీన్ని సెంటిమెంట్ అంటే..మ‌రికొంద‌రు ఫ్యాన్స్ కోసం పెడుతున్నారులే అంటుంటారు. కార‌ణ‌మేదైనా స‌రే మ‌హేష్ మాత్రం ప్ర‌తీసినిమాలో ప‌రుగులు తీయ‌డం కామ‌నే. ర‌న్నింగ్ చేసే స‌మ‌యంలో ఆయ‌న లుక్ చాలా ఎట్రాక్టివ్ గా ఉంటుంద‌ని అంటారు మ‌రికొంద‌రు. వేటాడే పులి కళ్లులాగా చాలా టెర్రిఫిక్‌గా ఉంటాయ‌ని…అది న‌చ్చే ఇలా ప్ర‌తీ ద‌ర్శ‌కుడు ప్రిన్స్‌తో ర‌న్నింగ్ సీన్స్ పెడుతున్నార‌ని అంటారు సినీ విశ్లేష‌కులు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad