Home సినిమా గాసిప్స్ పోకిరిని రిపీట్ చేస్తోన్న మహేష్

పోకిరిని రిపీట్ చేస్తోన్న మహేష్

Mahesh Babu New Look For Sarkaru Vaari Paata

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తూ వస్తున్నాడు. కాగా ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీని దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది.

‘సర్కారు వారి పాట’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ ఓ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్‌లో కేవలం మహేష్ జుట్టును మాత్రమే చూపించారు. ఇందులో కర్లీ హెయిర్‌స్టైల్‌తో మహేష్ కనిపించాడు. కానీ ఈ సినిమాలో కర్లీ హెయిర్‌తో కాకుండా లాంగ్ హెయిర్‌తో స్ట్రెయిట్నింగ్ లుక్‌లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో మహేష్ పోకిరి చిత్రంలో సరికొత్త అవతారంలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి స్టైలిష్ లుక్‌ను రిపీట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా కథ ఆర్ధిక నేరాల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమాతో మరోసారి మహేష్ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటంగ్‌ను మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad