Home సినిమా మహేష్ కోసం దిగుతున్న ఖైదీ డైరెక్టర్?

మహేష్ కోసం దిగుతున్న ఖైదీ డైరెక్టర్?

mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ తన సత్తాను మరోసారి చాటాడు. కాగా ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీ కోసం చాలా గ్యాప్ తీసుకుని, గీతా గోవిందం చిత్ర దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని ఓకే చేశాడు. ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్ర యూనిట్ ఓకే చేసింది.

ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తమిళంలో కార్తీ నటించిన ఖైదీ చిత్రంతో అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజన్, తెలుగులో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా ఉండనుంది. కాగా ఈ సినిమాలో హీరోగా మహేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి మహేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకధీరుడు రాజమౌళితో చేయాల్సి ఉంది. కానీ ఆర్ఆర్ఆర్ పూర్తయ్యి, మహేష్ సినిమా పట్టాలెక్కేందుకు చాలా సమయం పడుతుందని, అందుకే ఈ గ్యాప్‌లో ఓ సినిమా చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. పూర్తిగా విభిన్నమైన కథాంశంతో ఈ సినిమాను లోకేష్ కనకరాజన్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను మహేష్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేస్తారని అందరూ ఆశిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad