Home సినిమా టాలీవుడ్ న్యూస్ థమన్‌ను ఓ రేంజ్‌లో ఏసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్

థమన్‌ను ఓ రేంజ్‌లో ఏసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్

Mahesh Babu Fans Troll Thaman For Calling Brother

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ను ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించే పనిలో చిత్ర యూనిట్ ఉంది. ఇక ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ దుమ్ములేపారు. ట్విట్టర్ ట్రెండింగ్‌తో మహేష్ ఫ్యాన్స్ ప్రపంచ రికార్డును క్రియేట్ చేశారు. ఈ ఫీట్‌తో ఎంతో సంతోషంగా ఉన్న మహేష్ ఫ్యాన్స్, ఓ విషయంలో మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నారు.

మహేష్ బాబు తన ఫ్యాన్స్‌ను పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని ట్విట్టర్ వేదికగా ఇటీవల కోరాడు. దీంతో ‘సర్కారు వారి పాట’కు సంగీతం అందిస్తున్న థమన్, మహేష్ చేసిన ట్వీట్‌కు ‘మంచి నిర్ణయం తీసుకున్నారు బ్రదర్’ అంటూ రీట్వీట్ చేశాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్‌కు చెర్రెత్తుకొచ్చింది. ఇప్పటివరకు మహేష్‌ను కేవలం సార్ అంటూ సంబోధించిన థమన్, ఇప్పుడు బ్రదర్ అనడం ఏమిటని వారు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

థమన్ తన పంథాను మార్చుకోవాలని, లేకపోతే మహష్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవిచూస్తాడని వారు హెచ్చరిస్తున్నారు. ఇక థమన్ వెంటనే మహేష్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పుకోవాలని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మహేష్‌ను బ్రదర్ అని పిలిచి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన థమన్ అటు ‘సర్కారు వారి పాట’కు అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాలని రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండగా, అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad