
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రాలుగా నిలుస్తున్నాయి. కాగా మహేష్ నటించిన ‘1-నేనొక్కడినే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం విఫలం అయ్యింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా ఇప్పుడు ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.
ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా తాజాగా 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో మహేష్ కెరీర్లో డిజాస్టర్‌గా నిలిచిన మూవీ కూడా యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిందని అందరూ అంటున్నారు. ఇక ఈ సినిమాను సుకుమార్ అల్ట్రా స్టైలిష్‌గా తెరకెక్కించినా, ప్రేక్షకులు కథ ఎక్కకపోవడంతో ఈ సినిమాను వారు రిజెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్‌తో తన అభిమానులు మెప్పించాడు.
ఏదేమైనా మహేష్ సినిమా ఈ విధంగా యూట్యూబ్‌లో దుమ్ములేపడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా మహేష్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో ఈ సినిమా రానుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.