Home సినిమా చనిపోయినా సాయం ఆపని సావిత్రి. !

చనిపోయినా సాయం ఆపని సావిత్రి. !

సావిత్రి.! తెలుగుతెరమీద ఒక మహానటి. అజరామరం.. ఆమె అపూర్వ నటనాభినయం. ఆమె జీవితం ఒక చారిత్రాత్మక ఘట్టం. పుట్టిన దగ్గర్నుంచి పరమపదించే వరకూ ఆమె ఎంతోమందికి సాయం చేసింది. చేతికి ఎముకవుందా.. లేదా..? అనేంతగా ఆమె దానాలు చేసి ఎందరివో కష్టాలు కడతేర్చింది. ఆ మంచితనం, దయాగుణం వల్ల జీవిత చరమాంకంలో అత్యంత దౌర్భాగ్య పరిస్థితులు ఎదురవుతున్నా ఆమె తన దాన ఉదారతను వీడలేదు.

దానశీలిగానే తిరిగిరాని లోకాలకు వెడలిపోయింది. అయితే, ఆమె దివికేగినాకానీ, ప్రజానీకానికి కాసులు కురిపిస్తూనే వుంది. ఆమె నటించిన సినిమాలవల్లే కాదు, ఆమె పేరుతో తీసిన ‘మహానటి’ బయోపిక్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా నిర్మాతలకు కనకవర్షమే కురిపించింది.. ఇప్పటికీ కురిపిస్తోంది కూడా. తాజాగా ‘మహానటి’ సినిమాకి అరుదైన ఘనత లభించింది. 22వ షాంఘై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా రికార్డు సాధించింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌నోర‌మ‌ విభాగంలో మెయిన్‌ల్యాండ్ చైనాలో సందడి చేయబోతోంది.

వైజ‌యంతీ మూవీస్‌ – స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటి కీర్తి సురేశ్.. సావిత్రి పాత్ర‌  చేయగా,  దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌మంత అక్కినేని, విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హా పలువురు ద‌క్షిణాది స్టార్స్ ఈ మూవీ లో న‌టించారు. సినిమా గతేడాది మే 9న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో చూపించిన సావిత్రి జీవితంలోని ఘట్టాలు వాస్తవదూరం గా ఉన్నాయని కొందరు గొంతెత్తారు. ఏదేమైనా.. మహానటి నీకు జోహార్లు..! సరిరారునీకెవ్వరూ…

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad